Friday, October 23, 2009

పేరెంట్స్ మీద పేటెంట్స్..

ఈ మధ్య ఆఫీస్ లో ఊపిరిసలపనంత పనిలో ఉండగా నా స్నేహితుడు ఒకడు అలా బయటికి వెళదాం వస్తావా అని అడిగాడు..( నేను పాసివ్ వాడు ఆక్టివ్ స్మోకింగ్ కి)..సరే మనసుని కొంచెం ఆహ్లాదపరుద్దాం( పాసివ్ స్మోకింగ్ తో మాత్రం కాదు) అని వాడితో వెళ్ళా..ఏమీ మాట్లాడకుండా మౌనంగా మా వాడు నడుస్తుంటె నాకు ఎందుకో సందేహం వచ్హింది ..ఎప్పుడూ గల గలా మట్లాడే వీడు ఎందుకిలా ఉన్నాడు అని అనిపించి వాడినే అడిగా ...వాడు మొదట కొంచెం సందేహించినా తర్వతా వాడి మనసులో మాట బయట పెట్టాడు ..

"నేను చెప్పేది తప్పుగా అనుకొకురా మా అమ్మ ఈ మధ్య బాగా పక్షపాత ధోరణి చూపిస్తోంది , నా అక్క ,చెల్లి తో వాళ్ళ పిల్లలతో ఉన్నట్లు మాతో ఉండటం లేదు" నా పిల్లలతో అంతకు ముందున్న ప్రేమ చూపటం లేదు" పిల్లలు కూడా ఈ విషయం నాకు రెండు మూడు సార్లు చెప్పారు ..నేనంటే ఎలాగొలా సర్దుకుపోతా పిల్లల పసి మనసుల్లో ఇలాంటి భావాలు రాకూడదు కదా ..ఈ విషయం నేను అమ్మకి చెప్పలేను ..ఆమె ఎలాగైనా అర్థం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది "..

నా చిన్నప్పుటి రోజులు గుర్తొచ్హాయి ..మేము మా అమ్మమ్మ వాళ్ళు ఒకే ఊరిలో ఉండటం వల్ల , వాళ్లతో ఎక్కువ attachmentఉండేది ..మామయ్య వాళ్ళు శెలవలకి వచ్హినప్పుడు వాళ్ళ పిల్లలతో ఎక్కువ ప్రేమగా ఉన్నట్టు నాకూ అనిపించేది..అమ్మతో ఈ విషయం చెప్పినా ఎక్కువగా పట్టించుకునేవారు కాదు ..నా complaint ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేది..కొన్నాళ్ళకి complaint చెయ్యటం మానేసాను ..వయసు పెరిగే కొద్ది దానిలో అంతరార్ధం బాగా అర్థం అయింది ..ఇదంతా ఒక భ్రమ అని వారికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాలు అసలు లేవని..ఈ మధ్య ఒక పుస్తకంలో చదివా "ఎదుటవారిని అపార్థం చేసుకునేముందు వారిని సరిగా అర్థం చేసుకున్నామో లేదో ఒకసారి సరిచూసుకొవాలట "..

ఇక ప్రస్తుత generation విషయాని కొస్తే , వాళ్ళూ ఎప్పుడూ ఉమ్మడి కుటుంబాలని చుశె అవకాశం లేకపొవటం వల్ల , కుటుంబంలోని ముగ్గురు లేదా నలుగురు సభ్యుల మధ్య expectations బాగా ఎక్కువ అయిపోయి అది కొంచెం dissatisfaction and diappointments దారి తీస్తుందేమో అని నా అభిప్రాయం.. ...ఇద్దరు పిల్లలున్న ఇంట్లో ఒకరంటే అమ్మకి ఇష్టం ఒకరంటే నాన్నకి అనే భావాలు పిల్లల మనస్సులో కి రాకుండా జాగర్త పడాలి ..ఎందుకంటే అదే ఈ సమస్య కి మూలకారణం ..మన ఆలోచనలని అభీష్టాలని తల్లిదండ్రుల మీద రుద్ది వారు ఇది చేయలేదు అది చేయలేదు అనేకన్నా వారి ఇష్టాఇష్తాలని తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించటం అందరికి మంచిదని నా భావన...

"Attachments lead to expectations , expectations lead to disappointment "

welcome to your thoughts on this....

నేటి టీవీ చానల్స్

ఈ రోజుల్లో పుట్టగొడుగుల్లా వస్తున్నా టీవీ చానెల్స్ చూస్తుంటే ఒకరక మైన భయం కలుగుతోంది ...జనాలు చూసి చూసి వాటికి అలవాటు పడిపోయి ఎలా అయిపోతారో అని ... బ్రేకింగ్ న్యూస్ అనేదాని కి నిజమైన అర్థం ఏమిటి అని వెతుక్కోవాల్సిన అవసరం వస్తుంది..
ఒక చిన్న విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ ( కాకపోయినా ) ఎలా చెయ్యచ్చు అనేదానికి ఇది ఉదాహరణ ....

ఒక చిన్న నర్సరీ రైంని ఎలా మెయిన్ న్యూస్ ఐటెం చేస్తారో చుడండి ...
టీవీ న్యూస్ రీడర్ స్వప్న :: మనకి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది .."జాక్ మరియు అతని స్నేహితురాలు జిల్ ఒక బకెట్ నీళ్ళ కోసం కొండ ఎక్కుతుండగా పెద్ద ఆక్సిడెంట్ జరిగి జాక్ పళ్ళు విరిగాయి , జిల్ కొండ కిందకి దొర్లుకుంటూ వచ్చి పడింది"
..ఇప్పుడు కొండ దగ్గర మా క్రైమ్ ప్రతినిధి రమాకాంత్ వున్నాడు అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము ..ఆ రమాకాంత్ చెప్పండి అసలు అక్కడ ఏమి జరిగింది ...
థాంక్స్ స్వప్న అసలు ఏమి జరిగిందంటే" జాక్ మరియు అతని స్నేహితురాలు జిల్ ఒక బకెట్ నీళ్ళ కోసం కొండ ఎక్కుతుండగా పెద్ద ఆక్సిడెంట్ జరిగి జాక్ పళ్ళు విరిగాయి , జిల్ కొండ కిందకి దొర్లుకుంటూ వచ్చి పడింది"..
ఆ రమాకాంత్ మీకు జాక్ గురించి ఏమన్నా తెలుసా ? లెదు స్వప్న "జాక్ కొండ ఎక్కుతుండగా జారి పడి ఉంటాడు..అందుకే అతని పళ్ళు విరిగి ఉంటాయి" ...
టివి లో స్క్రోలింగ్ "కొండ పగల కొట్టిన పళ్ళు"...

స్వప్న: రమకాంత్ మీకు కొండ గురించి ఏమన్నా తెలుసా ?
రమకాత్: లేదు స్వప్న నాకు కొండ గురించి తెలీదు జాక్ ఎన్ని నీళ్ళు బకెట్లో తెస్తున్నడొ తెలీదు ..ఆ బకెట్ ఎంత బరువుందో కూడా తెలీదు..కాని ఇక్కడ ఒక ఐ విట్నెస్ వున్నాడు అతన్ని అడిగి వివరాలు తెలుసుకుందాము..
రమాకాంత్:మీరు చెప్పండి అసలు ఏమిజరిగింది..
సాక్షి:.....
రమాకాంత్: మీకు జాక్ , జిల్ గురించి ఏమన్నా తెలుసా? వారు స్నేహితులా?అన్నా చెల్లలా?ప్రేమికులా?భార్యా భర్తలా?
వాళ్ళు అసలు కొండ మీద ఏమిచేస్తున్నారు?
సాక్షి : జాక్ మరియు అతని స్నేహితురాలు జిల్ ఒక బకెట్ నీళ్ళ కోసం కొండ ఎక్కుతుండగా పెద్ద ఆక్సిడెంట్ జరిగి జాక్ పళ్ళు విరిగాయి , జిల్ కొండ కిందకి దొర్లుకుంటూ వచ్చి పడింది"..

రమాకాంత్: అది స్వప్న విషయం ..పాపం జాక్ ,జిల్ చాలా అమాయకులు ( వీడికేదొ తెలిసినట్లు) ..వాళ్ళు బకెట్ తో నీళ్ళు తీస్కురావటానికి కొండ మీదికి వెళ్ళారు..జాక్ పళ్ళు విరిగాయి..జిల్ దొర్లుకుంటూ కిందకి వచ్హింది ..

స్వప్న: థాంక్స్ రమాకాంత్ ..చుసారు కదా సంఘటనా స్థలమ్నుండి లైవ్ ని..ఇప్పుడు స్టూడియోలో నుండి Indian Institute of Applied Hill Sciences professor చంద్రసేఖర్ గారు మనతో వున్నారు వారినడిగి ఈ కొండ స్థితిగతుల గురించి తెలుసుకుందాము ..

మీరు చెప్పండి ఒక జాక్, ఒక జిల్, ఒక బకెట్, ఒక కొండ, కొన్ని పళ్ళు , ఒక పెద్ద ప్రమాదం? దీని మీద మీ అభిప్రాయం

నా knowledge ప్రకారం ఇది కొండ , దాని మీద మట్టి, వాళ్ళు మోస్తున్న బరువు , వాళ్ళ మానసిక స్తితిని పట్టి వుంటుంది ..
ప్రాధమిక సమాచారాన్ని పట్టి , నాకొక అనుమానం " జాక్ పళ్ళు విరిగాయి దీనికి ప్రధాన కారణం కొండ మీద మట్టి జారుడు గుణాన్ని కలిగి ఉండటం మరియు కొండ మీద బండ రాళ్ళు ఎక్కువగా వున్న ఉండటం ...

ఇక్కడ మనం ఒక ప్రధాన విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలి ...
"జాక్ పళ్ళు విరిగాయి " జిల్ దొర్లుకుంటూ కిందకి వచ్హింది" ...

కాబట్టి కొన్ని నిఘూడమైన విషయాలున్నాయి..
"అసలు బకెట్ జాక్ , జిల్ ఇద్దరూ మోస్తున్నారా ? మోస్తే ఇద్దరూ ఒకేసారి పడుండాలి ..
కాని జిల్ తర్వాత పడింది కాబట్టి జాక్ ముందు జారి వాడి కాళ్ళు జిల్ కి తగిలాయేమో...

( అబ్బో వీడి విష్లేషణ చూసి ఎవరైనా పడిపోవాలి ) ...

థాంక్స్ ప్రొఫెసర్ ...
చూసారు కదా జాక్ మరియు జిల్ ఎలా కొండ మీద నుండి పడ్డారో ...
ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే ఒసామా బిన్ లాడెన్ ని ఇప్పుడే ఆఫ్ఘనిస్తాన్లో పట్టుకున్నారు , పాకిస్తాన్ తన దేశ అణ్వాయుధాలని మన దేశం లోని అన్ని ప్రధాన నగరాలకి గురి పెట్టిన్ది , హిందూ మహా సముద్రంలో సునామీ వల్ల మనదేశ ప్రధాన సముద్రపాలిత ప్రాంతాలు మునిగిపొయాయి ,...

ఇప్పుడు ఒక బ్రేక్ తీస్కుందాం ..చూస్తూనే వుండండి ....బ్రేక్ అనంతరం మనం "జాక్ , జిల్ అసలు కొండ ఎందుకు ఎక్క వలసి వచ్చింది " ..ఒక అబ్బాయి అమ్మాయి కొండ ఎక్కే ముందు తీస్కోవలసిన జాగర్తలు మరింతమంది ప్రముఖులనుండి తెల్సుకుందాం ....:)


కర్టెసి :: ఒక ఫ్రెండ్ మెయిల్ కి తెలుగు అనువాదం ...( ఇది లేక పొతే ఈ పోస్టుకి కామెంట్స్ పెరిగిపోతున్నాయి )...

Monday, October 19, 2009

బాధితుల సంఘాలు - ఓ బాధితుని ఆత్మక్షోభ

ఈ మధ్య పత్రికల్లో , టీవీ చానల్స్ లో వివిధ రకాల బాధిత సంఘాల గోడు చూసి నాలో నిస్తేజంగా , నిద్రాణంగా ఉన్న ఒక బాధితుడు నిద్రలేచాడు ..వాడి కధే ఈ వ్యధ ..అంటే ఆ వ్యధే ఈ కధ..

మనం అందరం ఏదో ఒక బాధితులమనే ఘోర సత్యాన్ని( ఇది ఘోర సత్యం కాదేమో) గమనించాలి ..మనం ఎవరి చేత అయినా బాధకు గురైతే వెంటనే మనలాంటి వారెవరన్నా ఉన్నారేమో వెతికి పట్టుకొచ్చి ఒక బాధిత సంఘాన్ని వెంటనే ప్రారంభించాలి ...ఇది ప్రతి ఒక్క భారతీయుడి బాధిత హక్కుగా అందరం పరిగణించాలి ..ఈ బాధిత సంఘానికి ఒక మంచి పేరు పెట్టి ఒక పేరున్న నాయకుడి చే రిబ్బన్ కటింగ్ చేయించి అన్ని పత్రికల్లో పతాక శీర్షికలలో ,టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లో స్క్రోల్ అయ్యేలా చుస్కోవాలి ..మీరు ఈ సంఘాని కి అధ్యక్షులనే విషయం గుర్తుంచుకోండి ...ఇక ఒక సుదినాన బాధిత జనాన్ని పోగేసి ఒక మంచి సెంటర్ చూస్కొని అదే పనిగా అరుపులతో ,ప్లే కార్డ్స్ పట్టుకొని తిరుగుతూ చుట్టూ ఉన్న జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చెయ్యాలి...ఈ ప్రయత్నం లో కొన్ని పనీ పాట లేని చానల్స్ కంట్లో కూడా పడితే మీరు గారెల బుట్టలో పడ్డట్టే ...ఇక మీరు ఉదయానే ఆ టీవీలో "రభస " అనే కార్యక్రమం లో పాల్గొంటే మధ్యాహ్నం ఊ లో అక్కడే లంచ్ సాయంత్రం స్నాక్స్ ఏ లో సప్పర్ అం లో ..ఇక ఇదే ప్రోగ్రాం ని సదరు ఛానల్ ఓనర్లు మీ రభసని పట్టి ఇతర కార్యక్రమాల్లో (నేరాలు ఘోరాలు , నిప్పులాంటి అబద్దం ) ఆడ్ ఆన్ గా యూజ్ చేస్కొనే అవకాశం కూడా వుండి ....

అసలు వ్యధ విషయానికొస్తే ....

రిసెషన్ లో బాధలు అందరికి తెలిసిందే ...ఏ అర్థరాత్రో అపరాత్రో నిద్ర పోయే రోజులివి ...కనీసం రోజుకి ఆరుగంటలు నిద్రకి నోచుకోని అభాగ్యులని తలచుకొని వారికంటే ఒక మెట్టు ఎక్కువలో వున్నా మని పొంగిపొతున్న రోజుల్లో ...మన దురదృష్టం మన బ్లాంకెట్ లోనే నిద్ర పోయే రోజుల్లో ..ఒకానొక సుభోదయాన అప్పుడుప్పుడే నిద్ర పడుతుండగా మా పక్కింటి కుక్క ( కుక్క గారు అనాలి ఎందుకంటే అది మా పక్కింటాయన వాళ్ల తండ్రి పునర్జన్మ గా నమ్మకం) పెద్దగా మొరగడంతో నా నిద్ర భంగం జరిగింది..ఆ రోజంతా నా పనిమీద ఇది ఎంతో ప్రభావం చూపింది ..ఆ రోజే "కుక్క బాధితసంఘం " నా మదిలో నిల్చింది..
ఇలా మొదలు పెట్టి మా మేనేజర్ బాధితసంఘం , కార్ డ్రైవర్ బాధిత సంఘం , పూజారి బాధితసంఘం ఇలా ఎన్నో..
నిన్నే టీవీలో చూసా కోడళ్ళ బాదితసంఘం , ఓంకార్ బాధితసంఘం , అబ్బో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో...

అయ్యా ప్రక్రుతి వైపరిత్యలవల్ల బాధలు అనుభవించేవారు నిజమైన బాధితులని నా నమ్మకం...ఎందుకంటే ఇవి మనచేతుల్లో లేనివి మనకి చెప్పి రానివి ...
అంటే కాని మనకొచ్చే అతి చిన్న చిన్న బాధలన్ని భూతద్దంలో చూస్కొని మానసికంగా ,శారీరకంగా ,భౌతికమ్గా మనల్ని బాధించుకొని అరకొర గాని చానల్స్ లో వేదికలెక్కి వాదనలూ చేస్కొని విలువైన సమయం వృధా చేస్కొని ఇతరులని బాధించే వారు ఈ వేమన పద్యం ఒకసారి చదువుకోవాలి ..కొంచెం సరిచెయ్యబదినది..

"బాధలుండు వారు తండోపతండంబు
నుర్వి జనులకుండు ఈ బాధ
బాధలుండు వారు ఇతరుల బాధలెరుగారా "
ఎవరు పెరేస్కుంటే వారె నా మామ ...

లోకా సమస్తా సుఖినో భవంతు ....సర్వ్ జనా సుఖినో భవంతు ...

ఒక జోక్

రెండు ఆవుల నుండి పాలు ఎలా తీయాలి అన్నదానికి వివిధ ప్రముఖల అభిప్రాయలు లేక భావనలు


చంద్రబాబు :

రెండు ఆవులు విజయవాడలో వుంటే వాటిని ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసి హైదరాబాదులో వాటి పాలు తీయాలి...

జయలలిత :
పాలు తర్వాత తీద్దాం ముందు వాటి చేత "అమ్మా" ( అంబా కు బదులుగా ) అని ప్రాక్టీసు చేయించి వాటిని తన కాళ్ళ దగ్గర వుండేలా చుస్కుంటుందేమో...

కరుణానిధి:
ఒక ఆవుని తన కొడుక్కి ఇంకొక ఆవుని తన మేనల్లుడికి ఇచ్చేస్తాడేమో..

గాంధీ :
నాకు ఆవు పాలతో పని లేదు నేను మేకపాలే తాగుతా
లల్లూ:
ఆవుపాలివ్వాలంటే ముందుగా వాటికి ౯౦౦ కోట్ల దాణా వెయ్యాలి
రజనీకాంత్:
ఆవుల రెండిటిని పైకి విసిరేసి వాటి పాలని తన నోటి లోకి పడేలా చేస్కుంటాడేమో..

ఒక సర్దారు :
ఆవులకి రంగులు వేసి వాటి పాలు కుడా రంగురంగుల్లో వస్తాయేమో అని చుస్తాడేమో

ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు :
ఎప్పుడు , ఎంత సేపు , ఎలా పాలు పితకాలి అని ప్రణాళిక వేస్కుంటాడు
పాలు పితకటానికి సాధనాలు తయారు చేస్కుంటాడు
క్లైంట్ కి ఒక రెండు బొమ్మ ఆవులతో తను ఎలా పాలు పితుకుతాడో చూపిస్తాడు..
క్లైంట్ కి నచ్చకపోతే మళ్లీ మొదటి నుండి ఆరంభం
ఆసలు ఆవు పాలు పితికే తన సాధనాల్లో ఏదో లోపం వున్నట్టు గ్రహిస్తాడు ..మళ్లీ సాధనాల మార్పు
ఆవులు పాలు సరిగా ఇంస్తున్నాయో లేదో సరి chuskuntaadu

ఇప్పుడు ఆవుల్ని అన్ని హంగులతో ఆన్సైట్ పంపిస్తాడు
ఆన్సైట్ లో ఆవులు పాలు సరిగా ఇవ్వటం లేదని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ని అక్కడికి పంపిస్తారు ..తీరా అక్కడ ఆవులకి బదులు ఎద్దులకి పాలు పితుకుతున్న వారిని చూసి ఆ లోపం సరి చేస్తారు
అక్కడ అవి పాలు సరిగా ఇస్తున్నాయో లేదో సరి చూస్కొని ఒక శుభముహుర్తాన క్లైంట్ కి ఆవుల్ని పంపిస్తారు.
క్లైంట్ నుండి పాల రుచి మీద కంప్లైంట్ తో దాన్ని సరిదిద్దటం..
ఈసారి క్లైంట్ పాల రుచి బాగుంది కాని తక్కువ పాలిస్తున్నయన్న కంప్లైంట్ తో మళ్లీ దాన్ని సరిచేయటం...
క్లైంట్ హ్యాపీ ???
ఇలా అన్ని లోపాలు సరిదిద్దే సరికి ఆవులు పాలివ్వటమే మానేస్తాయి ...
ఇక కథ మళ్లీ మొదలు ..

మరో రెండు కొత్త ఆవులతో ....


కర్టసీ :: ఒక మిత్రుడి మెయిల్

Thursday, October 15, 2009



అందరికి దీపావళి శుభాకాంక్షలు ..

దీపావళి అప్పుడు ::

చిన్నతనంలో నరకచతుర్దశి రోజునుండే నాన్న ఎప్పుడు టపాసులు తెస్తారో అని ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం ..తెచ్చిన వెంటనే మా అందరి వాటిని పంచేవారు (అక్కయ్యలు,అన్నయ్యలకు ),నేను అందరికంటే చిన్న వాణ్ణి కావటం వల్ల మనకి కొంచెం ఎక్కువే ముట్టేవి..ఇక అసలు ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం అవుతుంది..అందరం ఎవరికీ పంచిన టపాసులని వాళ్ళు ఎండపెట్టుకోవటం ..నిమిషానికి అరవై సార్లు అవి ఎండినాయో లేదో అని చూస్కోవటం (అసలు విషయం అది కాదులెండి ఎవరైనా నా టపాసులని కొట్టేస్తారేమో అని భయం )..ఒకటికి నాల్గు సార్లు లేక్కపెట్టుకోవటం .. నాకు ఇచ్చినవి సరిగా కాలతాయో లేదో అని మచ్చుకి ఒకటి చొప్పున కాలవటం ..ఇలా కాల్చగా నాకు మిగిలిన వాటికీ పక్క వాళ్ళనుండి కొన్ని సర్దటం ( వాళ్ళకి తెలీకుండా) ..పక్క ఇళ్ళ వాళ్ళకి నా టపాసులని చూపించటం ...వాళ్ళ వద్ద ఏమన్నా కొత్తవి వుంటే వస్తు మార్పిడి పద్దతి ద్వారా ఆ లోటు భర్తీ చెయ్యటం ...అబ్బో ఒకటేమిటి లెండి అన్ని చెప్తే ఇది ఒక గ్రంథమే అవుతుంది ..
ఇక ఆరోజు రాత్రి నరకసురున్ని తయారు చెయ్యటం , గుడ్డలో గడ్డి కుక్కి చేసే ఈ బొమ్మకి ఫైనల్ టచ్ అప్ గా బొగ్గు తో కళ్లు, ముక్కు , కోరలు దిద్దే వారు ..ఇక దానిలో కొన్ని టపాసులు కుక్కి ఒక చోట పెట్టి నిద్ర పోయే వాళ్ళం ...తెల్లవరగానే
నరకాసుర దహనం అబ్బో చాల బాగుండేది ..చలి చలిలో వేడి వేడి మంట ఇంకాసేపు వుంటే బాగుండు అనిపించేది ..

ఇక దీపావళి రోజున కొత్త బట్టలు వాటికీ పసుపు పెట్టుకోవటం , లక్షీ పూజ ఆ తర్వాత పెట్టె స్వీట్లు ఎప్పుడు చీకటి పడుతుందా ఎప్పుడు అమ్మ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందా అని కాండిల్స్ రెడీ చేస్కోవటం ...నా భాగంలో కొన్ని మాత్రమే కాల్చి మిగతా అందరు కాల్చే దాకా వెయిట్ చేసి మళ్ళీ కాల్చుకోవటం ...ఇవన్ని మధురానుభుఉతులు ..

దిఇపావాలి ఇప్పుడు ::
ఉరుకులు పరుగులు జీవితం ...ఫ్యామిలీ తో స్పెండ్ చేసే టైం పాత ...ఆఫీసు జీవితం ఎక్కువ ..ప్రాజెక్ట్ డెడ్లైన్లు ,క్లైంట్ మీటింగులకే ఎక్కువ సమయం పోగా , మిగతా సమయం లో పూజ ఒక పది నిముషాలు ఆ తర్వాత ఇంకో అరగంట స్నేహితులకి విషెస్ చెప్పటం , pillala చేత టపాసులు కల్పించటం మొత్తం ఒక మూడు గంటల్లో పని కానిచ్చి ఆ తర్వాత టీవీలో వచ్చే దిక్కుమాలిన కార్యక్రమాలు చూసి నిద్ర పోవటం ...
ఎంత మార్చుకున్దామన్న మారని ఈ రొటీన్ లైఫ్ ...
లేదు ఈ దీపావళికి ఏమైనా ఆ paata madhuranni ఆస్వాదించాలి ..ఎలాగైనా...

అందరికి మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు .....

నాకు నచ్చిన పాట

ఈ రోజు ఎందుకో పదే పదే ఈ పాట గుర్తొస్తుంది ....



ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు .....

ఒదిగి ఒదిగి కూచుంది బిడియ పడే వయ్యారం
ముడుచుకొనే కొలది మరీ మిడిసి పడే సింగారం
సోయగాల విందులకి వేయి కనులు కావాలి

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినోసగేరో
పులకరించు మమతలతో పుల పాన్పు వేసారు ....

ఈ పాట ని నారాయణ రెడ్డి రాసారు ...పాట పల్లవిలో ఒకసారి గూటి ఒకసారి కోటి అన్నట్లుగా వినిపిస్తుంది ..రామకృష్ణ గారి స్వరంలోని మృదుత్వం , గాంభిరత్వం అలాగే ఎప్పుడు ఉండే ఆ హస్కీ నెస్ కొట్తోచినట్లు కనిపిస్తాయి (వినిపిస్తాయి)
ఇది చాల నెమ్మదిగా సాగే పాట ...మసక చీకటిలో సాగే పాట ఇది..బాపు గారి మార్కు బాగా కనిపిస్తుంది ...
చాలా రోజులుగా ఎన్నో బ్లాగులు చూస్తూ నేను ఒక బ్లాగు ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది ...అనిపించిందే తడవుగా ఇది ఇలా ఇక్కడ ఆరంభం అయింది ......