ఇప్పటికే మన నాయకులు అమాయక ప్రజలందరికి సంకేతాలు పంపారు...హింస వద్దు , ఆత్మహత్యలు వద్దు,ఆంధ్రవాళ్లు మన సహొదరులు వారి మీద దౌర్జన్యాలు వద్దు అని..చాలు ఈ సంకేతాలు మేము చూసుకుంటాం అని విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు...దీనివల్ల నష్టం ఎవరికి..పొద్దున ఎవరో టివిలో చెప్తున్నారు మాకు ఈ 50యేళ్ళలో జరిగిన నష్టం ముందు ఇది ఎంత అని..చాలా బాధాకరం..
విద్య , ఉద్యోగ అవకాశాలు, మౌళికవనరుల అభివ్రుద్దికి శాంతి ఎంతో ముఖ్యం ..
1)వేరే రాష్త్రం నుండి వేరే దేశమ్నుండి పెట్టుబడులు రావా లన్న
2)కొత్తగా విద్యాలయాలు స్థాపించాలన్న
3)కొత్త ఆరోగ్యకేంద్రాలు నిర్మించాలన్నా
4)ఉపాధి అవకాశాలు పెంచాలన్నా
5)మన పిల్లలని అతి ప్రమాదకరమైన వ్యాధులనుండి రక్షించి వారికి బంగారు భవిత ఇవ్వాలన్న
6)మనమందరం ఆరొగ్యకరమైన వాతవరణంలో పెరగాలన్నా
హింస విడనాడాలి..మన నిరసనని ఇంకొకరకంగా కూడా వ్యక్తపరచవచ్హు..
అందరికి తెలిసిన విషయమే అమెరికా ఇప్పటికే ట్రావెల్ అడ్వైసరీ అని వారి పౌరులను ఆంధ్రప్రదేశ్ వెల్లటం సురక్షితంకాదు అని చెప్పింది..
యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి నిర్ణయం తీస్కున్నట్టు వినికిడి..
ఇది ఎవరికి నష్టం..
ఒకవేళ మేము ఎవరిమీద ఆధారపడం మా వుద్యోగాలు మేమే స్రుష్టిస్థాం అని అనుకుంటే చెయ్యగల్గిందేమిలేదు...
రాజకీయనాయకులు ఊసరవిల్లుల లంటివారు..యేయెండకా గొడుగు పట్టేరకం..వారి మోసపూరిత వాగ్దానాలు,విద్వేషాలు పెంచే ఉపన్యాసాలు చూసి మోసపొకండి. ...
ఇది మన మాత్రుభూమి మనమే దీనికి పునర్జీవనం తేవాలి...
ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అయినా మనం ఇంకా కుంచిత మనస్తత్వాలతో ఈ నేల నాది ఈ నింగి నాది అనుకోవటం ఎంతవరకు సబబు..
నేను ఒక ఎమెన్సి కంపనీ లో పనిచేస్తాను..మా కంపనీకి చెన్నై ,ముంబై లలో కుడా శాఖలు వున్నాయి,.మొత్తం ఉద్యోగుల సంఖ్య 8000పైచిలుకే ..ఈ గొడవల నేపధ్యంలో మొన్న సీనియర్ మానేజ్మెంట్ మీటింగ్ జరిగింది..చెన్నై కి చెందిన కొందరు సహోద్యొగులు ఇక్కడ(హైదరాబాదు) వాతావరణం బాగలేదని ఫారెన్ క్లైంట్లు ప్రాజెక్టు డెడ్లైన్లు మీట్ అవటంలేదని కనుక ఇక్కడినుండి ఉద్యోగులని చెన్నై తరలించమని రికమండ్ చేసారు..అలాఏమి లేదని నేను నా వాదన చేసాను..పరిస్థితులని గమనిస్తున్నామని మనకి క్లైంటే దేవుడు కాబట్టి వాడికి ఏమన్న ఇబ్బంది కలిగితే ఇక్కడి బేస్ చెన్నైకి మారుస్తామని మా డైరెక్టర్ చెప్పారు...మాలో చాలమంది తెలంగాణా జిల్లాలకి చెందినవారున్నారు....
అందరికి నా విన్నపం అమ్మలారా అయ్యలారా హింసని విడనాడండి..ఈ రొజు మీరు చేసే ఈ విధ్వంసాలు ఒక మాయని మచ్హని ఈ ప్రాంతానికి మిగులుస్తాయి..
అన్నట్టు నేను సమైక్యవాదిని కాను అలాగే తెలంగాణా వాదినికూడా కాదు..
ఒక మానవతా వాదిని..అహింసావాదిని..
Thursday, December 24, 2009
Monday, December 21, 2009
ఇంకా ఎన్నాళ్ళు....
నిన్న రాత్రి రాజగోపాల్ అద్రుశ్యం ఈ రోజు నింస్ లోప్రత్యక్షం...
దీని మీద మీడియా హడావుడి..
ఒక చానెల్లో మరీ ఎక్కువగా ...ఇలా
ఇద్దరు ఎంపీలు..ఇద్దరిది ఒకే పంధా..ఒకరిని జైలుకి తరలించారు..ఇంకొకరిని పారిపోయేలా చేశారు ..ఎందుకీ వివక్ష అని చర్చ..ఇది నిజంగా పైత్యపు అలొచనలకి పరాకాష్ట ...
ఇంకా మీడియాకి కూడా రెగ్యులేషన్స్ పెట్టాలేమొ...
ఫ్రజల మధ్య విద్వేషాలు లేకపొయినా కలిపించటంలో అగ్రస్థానం మన నాయకులదైతే..రెండో స్థానం మీడియాది..
ఒక ప్రశ్న :
ఈ పరిస్థితుల్లో ఎవరికి ఏమిజరిగినా మొదటి టార్గెట్ ఎవరు?
ఇంకెవరు పాపం పోలీసులు ...వాళ్ళకే సస్పెన్షన్లు, మెమోలు.. ఇక్కడ చిన్నపిల్లవాడికి కూడా అర్థం అయ్యే విషయం ఏమిటంటే మన దేశంలో పోలీసులు స్వతంత్రంగా ఏనిర్ణయాలు తీస్కొలేరు....మరి వారికి ఆదేశాలు ఇచ్హెదెవరు అన్నీవారేచేశారని వారిని సస్పెండ్ చేసేదెవరు..అంతా మాయ....
మరి ఈ జగన్నాటక సూత్రధారి ఎవరు?

Wednesday, December 16, 2009
జెపి - మన్మోహన్ కలయిక
1)కాంగ్రేస్ పార్టీ కెసీఅర్ ప్రాణాలు కాపాడటానికి మరియు అన్ని పార్టీలు అంగీకరించినందుకే వారి మిత్రపక్షాల అభిప్రాయాన్ని తీస్కోకుండా అర్దరాత్రి ప్రకటన చెసింది ..
2)అన్ని ప్రాంతాల ప్రజల మనొభావాలను పరిగణలోకి తీస్కొని సరైన నిర్ణయం తెలంగాణా పై తీస్కొవాలి
3)శాంతిభద్రతలను కాపాడి ప్రజలు అందోళనకు గురికాకుండా చూస్కోవాలి
4)భారతదేశ ఆర్ధిక ప్రగతికి విఘాతం కలగకుండా ప్రజామోదయోగ్యమైన ప్రకటన చెయ్యాలి ..
కొసమెరుపు...
1)టివి9 విలేఖరి జెపి ని చెయ్యిపట్టుకొని పార్లమెంటు ఆవరణ బైటకి తీస్కువస్తుంటే ంటివి విలెఖరి ఆయన్ని గద్ద తన్నుకు పొయినట్టు పక్కకి తీస్కెల్లి ప్రశ్నల వర్షం కురిపించింది...టివి9 వాడు ఎమి చెయ్యలేక అక్కడే వున్న ఒక రాయలసీమ ఎంపిని ప్రశ్నిస్తూ ...మాటి మాటికి జెపి పక్కనే వున్నడో లేక వెల్లిపోయడో అని జాగర్త పడుతున్నడు..
2)టివి9వాడు జెపితో పదే పదే అన్ని రాజకీయ పార్త్టీలు యు టర్న్ తీస్కున్నాయి కదా ఇప్పుడు ప్రధాని కుడా యు టర్న్ తీస్కుంటారా అని అడిగితే ఆయన నిర్మొహమాటంగా మీటివి వాళ్ళు టీఅర్పి రేటింగ్స్ పెంచుకుంటానికి ఇలా మట్లాడకపొతే బాగుంటుంది అని అంటం విశేషం..

Subscribe to:
Posts (Atom)