నిన్న నేషనల్ జియోగ్రఫీలో ఒక అద్భుత దృశ్యం నన్ను కట్టి పడేసింది ...ఎప్పుడు అనుకునే వాడిని ఇలా జరిగితే బాగుండు అని..అలానే జరిగింది ...
పెద్ద అడవి ..కొన్ని ఆడ సింహాలు , సింహం పిల్లలు కూర్చొని వున్నాయి..వాటికి దూరంగా రెండు అడవి దున్న పోతులు ఒక చిన్న దున్నపోతు ఈ సిమ్హాలున్న వైపుకే వస్తున్నాయి..సింహాలు పెద్ద పొదల చాటున ఉండటంతో వాటి ఉనికి పసి కట్టలేక పోయాయి ..దూరం నుండి ఈ తతంగం అంతా కెమెరాలో బందిస్తున్నారు..అప్పటికే ఆకలితో ఉన్న సింహాలు ఒక్క ఉదుటన దున్నపోతుల మీద పడ్డాయి..తత్తర పాటుతో దున్నపోతులు వెనక్కి ఒకటే పరుగు..సింహాలు అప్పటికే బలహీనంగా ఉన్న చిన్న దున్నపోతును టార్గెట్ చేసుకున్నాయి..అన్ని కలిసి దాని మీద పడి పక్కనే ఉన్న నదిలోకి దాన్ని ఈడ్చుకొని వెళ్ళాయి..
అయ్యో అనిపించి నేను ఛానల్ మార్చేసాను..ఒక పదినిమిషాల తర్వాత ఆ ఛానల్ చుస్తే మళ్లీ ఇదే వస్తుంది..ఆశ్చర్యంతో చూస్తే,, దూరం నుండి తమ కెమెరాల్లో జూమ్ చేసి మరీ ఈ దృశ్యాన్ని చూస్తూ ఛానల్ వారు సింహం ఎలా వేటాడు తుందో వివరిస్తున్నారు..ఒకరు, "ఇప్పుడు ఒక సింహం ఆ దున్నపోతు నోరు ముసి దానికి సఫకేషన్ కలుగచేస్తుందని మరొక సింహం దాని ట్రాకియా గట్టిగా పట్టి చంపివేస్తుందని"..కాని అక్కడ జరుగుతున్న తంతు వేరు..వ్యాఖ్యాతలు ఇంకో రెండు నిముషాలలో ఆ దున్నపోతు చనిపోతుందని అప్పుడు దాన్ని నీటి బయటకు లాగి సింహాలు తింటాయని అంటున్నారు..రెండు నిముషాలు గడిచాయి..ఇంకా దున్నపోతు పెనుగులాడుతోంది..హటాత్తుగా ఒక పెద్ద శబ్దం ..నీటిలో అలజడి..ఒక పెద్ద మొసలి సింహాలను అదిలించి దున్నపోతును నీటిలోకి లాగాలని ప్రయత్నిస్తుంది..
వ్యాఖ్యాతలు "ఇప్పుడు సింహాల ముందున్న ఆహరం ఎలా మొసలి తన్నుకు పోతుందో చూద్దాం " అంటున్నారు..
తీవ్రమైన పెనుగులాటలో దున్నపోతును సింహాలు నీటి బయటకు లాగేసాయి ..
ఇప్పుడు ఆశ్చర్యం వ్యాఖ్యాతల వంతు..
ఇంతలో దూరంనుండి దున్నపోతుల మంద..సింహాల వైపుకు దూసుకు వస్తుంది..
వాటిలో ఒక రెండు దున్నపోతులు మొత్తం సింహాలని తరిమి తరిమి కొట్టాయి..
ఇంకో నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ..అప్పటి దాకా సింహాలతో పెనుగులాడిని చిన్న దున్నపోతు ఒక్క ఉదుటన లేచి మందలో కి పరిగెత్తుకొని వెళ్ళింది..
చిన్నప్పుడు పరవస్తు చిన్నయసూరి గారి కథలలో చదివిన కొన్ని సంఘటనలు కళ్ళముందు కనిపిస్తుంటే ఎలా వుంటుందో మీరే ఆలోచించుకోండి ..( పంచతంత్రంలో ఇలాంటి కథలేదని నన్ను అడగద్దు ..భావసారూప్యం కలిగిన కథగా అనుకోండి )...
టుగెదర్ వుయ్ కెన్ కానకర్...డివైడెడ్ వుయ్ ఫాల్ ...దీని తెలుగు నీతి మనందరికీ తెలిసినదే...
పైన చెప్పిన లాగ జరిగితే పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందని అనిపిస్తే -- నో కామెంట్స్ ..
Monday, June 14, 2010
Friday, February 12, 2010
స్వర స్మరణీయుడు - ఘంటసాల

మొన్న బుధవారం టివిలో చానెల్స్ మారుస్తూ నేను అప్పుడప్పుడు చూసే దూరదర్శన్ దగ్గర ఆగిపోయాను..అక్కడ ప్రసారం అయ్యే కార్యక్రమం నన్ను కట్టిపడేసింది..అదే "స్వర స్మరణీయుడు"..విజయదుర్గ యాంకర్గా ఎవరొ ఒక ఆయన్ని ప్రశ్నలు వేస్తుంది..ఆశ్చర్యం అన్ని ప్రశ్నలకి ఆయన ఠపీమని జవాబులు ఇస్తున్నాడు..ఆయన ఒక ప్రభుత్వ ఊద్యొగి అట..ఘంటసాల గారి మీద ఎంతో రీసెర్చ్ చేశారట..ఎంత అభిమానం అనుకున్నా..యాంకర్ ఒక పాటని( కనిపించే పాట ఒకటీ వెనుక బాక్గ్రౌండ్లో వినిపించేది ఇంకొక పాట అన్నమాట) టివి స్క్రీన్ మీద చుపించి ఆ పాట గురించి అడగ్గానే ఆయన ఆ పాటలు ఏ సినెమాలో చేశారో ,స్వర పరిచింది ఎవరో ,ఎవరు రాసారో ,ఏ రాగంలో స్వరపరిచారో ,ఏ బానెర్ పై ఆ సినెమా రిలీస్ అయిందో ఇలాంటి విషయాలన్నీ అలవోకగా చెప్పేస్తున్నారు...ఆ మహనీయుడి మీద నిజమైన అభిమానం అంటే ఇదేనేమో అనుకున్నా..
ఘంటసాల గురించి ఎంత చెప్పినా తక్కువే..ఆయన పాటలు ఎప్పటికీ అజరామరాలు..ఆయన పాడిన భక్తి గీతాల్లో భక్తి రసం ఎలా ఉట్టిపడుతుందో అవి అస్వాదిస్తేకాని తెలీదు..."ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి.. నీ పద పీఠిక తలబడి"..ఆహా ప్రభాత వేళ పూజ చేస్తే ఇలాంటి అనుభూతి కలుగుతుందా ..తప్పకుండా...
"శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా"...ఆయన అమ్రుత గళంలో నుండి జాలు వారిని ఈ గీతం నిజంగా ఆ నల్లనయ్యకు ఒక మంచి జోలపాట...
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నొ మధురమైన పాటలు..ఒక్కొక్కటి ఒక్కో తీరు...
ఆయన వర్ధంతి రోజున అన్ని టివి చానెల్స్ ( పోటీ కొసమేమో మరి)ఆయన్ని తలుస్తూ మంచి కార్యక్రమాలు ప్రసారం చేసి ఈతరం వారికి ఆయన్ని పరిచయం చేసినందుకు...నాలాంటి అభిమానులకు ఆయన్ని స్మరించుకునే భాగ్యం కలుగచేసినందుకు క్రుతఙ్నతలు....

Friday, January 8, 2010
మీడియాలో దురంధరులు
ఈ మధ్య మీడియాలో వీరిని చూసిచూసి వీరి వాక్పటిమమీద ఒక చిన్న విశ్లేషణ :
కె సి ఆర్ :
"వాక్దురంధర"..రైమింగ్ పదాలతో వ్యాఖ్యలు చెయ్యటం లొ దిట్ట ( అని అనుకొంటాడు)..మాటకి ముందు వెనుక "తెలంగాణా" ఉంటుంది...తనకి తగ్గ తర్క విద్వాంసుడు లేడనుకొని ఎప్పుడు ఒంటరిగానే మీడియలో కనిపిస్తాడు..
హరీష్ రావు :
మామకి తగ్గ అల్లుడు..మామ స్రిప్టులని నొక్కేసి కొంత కపిత్వం జోడించి లొల్లి చేస్తుంటాడు...ఈయనికి తర్క జ్ణానం నిల్లు లొల్లి ఫుల్లు..ఈయనికి "వాక్డాంబిక" అనే బిరుదు కూడా ఉంది..తన పెంపుడు కుక్కకి పిల్లలు పుట్టకపోతే అది అంధ్రా వాళ్ళ పనే అనటానికి ఏమాత్రం సంకోచించడు..
కె కె:
ఏకకాలంలో తెలుగు , ఇంగ్లీష్ ,హిందీలలో మాట్లాడుతూ అసలేమి మట్లాడుతున్నాడో అర్థంకాక రిపోర్టెర్నే అర్థం అయిందా అని అడుగుతాడు..మాట్లాడే విధానంలో వెంకయ్యనాయుడికి ఈయనకి పోలికలుంటాయి..ఈయన బిరుదు "వాక్ దిగ్భ్రమ" ..
డి యస్ :
ఈయనకి నాల్క కాస్త మందం..తప్పు మాట్లాడకపోయినా తప్పే వినిపిస్తుంది..మట్లాడదామ వద్ద్దా అనే సంకోచెంతోనే మట్లాడుతుంటాడు..ఈయన బిరుదు "వాక్పీడన"..
చంద్రబాబు:
ఈయన మాటలు వినాలంటే టివి చూడకుండా వినాలి..టివి చూసినా ఈయన ముఖం అంటే కళ్ళని అస్సలు చూడద్దు..ఈయన కళ్ళకి అంటే ఫీలింగ్స్కీ చెప్పే మాటలకి అస్సలు మాచ్ అవ్వదు..ఈయన బిరుదు "వాక్ వైరుఢ్య"
నన్నపనేని:
ఈమె వాక్పటిమ ఎక్కువ లాజిక్ తక్కువ ..ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా మాట్లాడుతుంది..కాని కంటెంట్ తక్కువ..అస్సలు చదువుకోలెదు అంటుంది...పుస్తకాలు తినెసి వచ్చినట్టు మాట్లాడుతుంది...ఈమె బిరుదు "వాక్ దుంధిభి"
లగడపాటి:
ఈయన అసలు ప్రెస్సు కాంఫరెంసులు ఎందుకు పెడతాడో ఆయనకి గాని ప్రెస్సు వారికి గానీ తెలీదు....చెప్పాలనుకునేది ఒకటి చెప్పేది ఒకటి..ఈయన స్క్రిప్టులు ఎవరు తయారు చేస్తారో ఆ దేవుడికే ఎరుక..చెప్పేది తక్కువ "కాదు" "కాదు" అనటం ఎక్కువ...ఏమి కాదో ఎవరికి కాదో ??ఈయన బిరుదు "వాక్ సం(వి)చలన"

Thursday, January 7, 2010
ఈ పదాల అ(వ్య)ర్థమేమి
ఇవి కొన్ని సినిమాల్లొ వాడినవి::
కటింగ్ కొడుతున్నావా?
రఫ్ ఆడిస్తా
రంగు పడుద్ది
సీను సితార అవుతుంది
స్పాట్ పెడతా
వీటిలో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడటం జరిగింది కాని వాటి అర్థాలు ఇక్కడ వేరు....
కటింగ్ కొడుతున్నావా?
రఫ్ ఆడిస్తా
రంగు పడుద్ది
సీను సితార అవుతుంది
స్పాట్ పెడతా
వీటిలో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడటం జరిగింది కాని వాటి అర్థాలు ఇక్కడ వేరు....
Subscribe to:
Posts (Atom)