ఈ మధ్య మీడియాలో వీరిని చూసిచూసి వీరి వాక్పటిమమీద ఒక చిన్న విశ్లేషణ :
కె సి ఆర్ :
"వాక్దురంధర"..రైమింగ్ పదాలతో వ్యాఖ్యలు చెయ్యటం లొ దిట్ట ( అని అనుకొంటాడు)..మాటకి ముందు వెనుక "తెలంగాణా" ఉంటుంది...తనకి తగ్గ తర్క విద్వాంసుడు లేడనుకొని ఎప్పుడు ఒంటరిగానే మీడియలో కనిపిస్తాడు..
హరీష్ రావు :
మామకి తగ్గ అల్లుడు..మామ స్రిప్టులని నొక్కేసి కొంత కపిత్వం జోడించి లొల్లి చేస్తుంటాడు...ఈయనికి తర్క జ్ణానం నిల్లు లొల్లి ఫుల్లు..ఈయనికి "వాక్డాంబిక" అనే బిరుదు కూడా ఉంది..తన పెంపుడు కుక్కకి పిల్లలు పుట్టకపోతే అది అంధ్రా వాళ్ళ పనే అనటానికి ఏమాత్రం సంకోచించడు..
కె కె:
ఏకకాలంలో తెలుగు , ఇంగ్లీష్ ,హిందీలలో మాట్లాడుతూ అసలేమి మట్లాడుతున్నాడో అర్థంకాక రిపోర్టెర్నే అర్థం అయిందా అని అడుగుతాడు..మాట్లాడే విధానంలో వెంకయ్యనాయుడికి ఈయనకి పోలికలుంటాయి..ఈయన బిరుదు "వాక్ దిగ్భ్రమ" ..
డి యస్ :
ఈయనకి నాల్క కాస్త మందం..తప్పు మాట్లాడకపోయినా తప్పే వినిపిస్తుంది..మట్లాడదామ వద్ద్దా అనే సంకోచెంతోనే మట్లాడుతుంటాడు..ఈయన బిరుదు "వాక్పీడన"..
చంద్రబాబు:
ఈయన మాటలు వినాలంటే టివి చూడకుండా వినాలి..టివి చూసినా ఈయన ముఖం అంటే కళ్ళని అస్సలు చూడద్దు..ఈయన కళ్ళకి అంటే ఫీలింగ్స్కీ చెప్పే మాటలకి అస్సలు మాచ్ అవ్వదు..ఈయన బిరుదు "వాక్ వైరుఢ్య"
నన్నపనేని:
ఈమె వాక్పటిమ ఎక్కువ లాజిక్ తక్కువ ..ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా మాట్లాడుతుంది..కాని కంటెంట్ తక్కువ..అస్సలు చదువుకోలెదు అంటుంది...పుస్తకాలు తినెసి వచ్చినట్టు మాట్లాడుతుంది...ఈమె బిరుదు "వాక్ దుంధిభి"
లగడపాటి:
ఈయన అసలు ప్రెస్సు కాంఫరెంసులు ఎందుకు పెడతాడో ఆయనకి గాని ప్రెస్సు వారికి గానీ తెలీదు....చెప్పాలనుకునేది ఒకటి చెప్పేది ఒకటి..ఈయన స్క్రిప్టులు ఎవరు తయారు చేస్తారో ఆ దేవుడికే ఎరుక..చెప్పేది తక్కువ "కాదు" "కాదు" అనటం ఎక్కువ...ఏమి కాదో ఎవరికి కాదో ??ఈయన బిరుదు "వాక్ సం(వి)చలన"