ఈ హెడ్డింగ్ చూసి మీకు టాపిక్ అర్థం అయివుంటుంది ....
రాజారావు ఎన్నో రోజుల తర్వాత తన అమ్మ నాన్నలతో , బంధువులతో సరదాగా గడుపుదాం అని ఒక వారం రోజులు లీవ్ తీస్కోని తన భార్య , పన్నెండు నెలల పిల్లాడితో హౌరా ట్రైన్లో హైదరాబాద్ కి ప్రయాణం అయ్యాడు ..ఈ లీవ్ దొరకటం కోసం తను ఎంత కష్టపడింది ఎన్ని ఓవర్ టైం లు చేసింది , తన బాస్ ని ఎన్ని సార్లు ప్రాధేయపడింది తనకి బాగా తెలుసు కాని తన వారితో గడపబోతున్న అనందం ముందు ఇవన్ని తనకి చాల చిన్నవి...
తేది : ౩౦-నవంబర్ - ౨౦౦౯
ఫలక్నుమా ఎక్ష్ప్రెస్స్ గుంటూరు దాటి హైదరాబాద్ వైపు పరుగులు తీస్తుంది ...ఇంతలో ఒక పెద్ద శబ్దంతో రైలు ఆగింది ..చుట్టూ పచ్చటి పొలాలు దూరంగా ఏదో చిన్న వూరు కనిపిస్తుంది..మొబైల్ సిగ్నల్స్ కుడా దొరకటం లేదు..ఎవరో మొబైల్లో పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నారు ..మిర్యాలగూడ - నల్గొండ మధ్య రైలు పట్టాల మధ్య ఫిష్ ప్లేట్లు తొలగించారని రైళ్ళని ఆపి వేసారట అని ఎవరో చెప్పారు...ఈపాటికి హాయిగా అమ్మ నాన్నలతో గడుపుతానన్న అనందం రాజారావు లో మాయ అయింది ..ఎప్పటికి ఇంటికి చేరుతానో అనే ఆందోళన ...పిల్లాడికి రెండురోజులకని తెచ్చుకున్న ఫుడ్ రిజర్వు లన్ని అయిపోయాయి ..పిల్లడు ఏడిస్తే ఎలా అనే భయం..
.......
అదే ట్రైన్లో ఒరిస్సానుండి వస్తున్నా చరణ్జీత్ కి ఈ రోజు ఒక పెద్ద కంపనీలో ఇంటర్వ్యూ ..ఎన్నో రోజులనుండి కలలు కంటున్నా ఈ వుద్యోగం తనని వరిస్తుందన్న ఆనందంలో వున్నాడు ...వ్రాత పరీక్ష , టెక్నికల్ ఇంటర్వ్యూలు దాటి హెచ్ ఆర్ ఇంటర్వ్యూ కి పిలవటంతో తనకి వుద్యోగం వస్తుందన్న కాన్ఫిడెన్సు బలపడింది..పన్నెండు గంటలకి ఇంటర్వ్యూ ..పదిగన్టలవుతున్న ఇంకా గుంటూరికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నామన్న ఆలోచన టైం కి హైదరాబాద్ చేరుకున్తనో లేదో అన్నా ఆలోచన అతని బుర్ర తొలిచేస్తుంది..
........................................................................................................................
క్రిష్నయ్య aఒక సామాన్య ఉద్యోగి ..తనకి పెద్ద చదువు లేదన్న కారణంగా తన కుటుంబానికున్న చిన్న చిన్న కోరికలు కుడా తీర్చలేక పోతున్నందుకు ఎప్పుడు ఒక అసంతృప్తి ...అందుకే తన పదమూడేళ్ళ కొడుకుకి ఒక పేరున్న స్కూల్ లో చేర్పించాడు ..తాహతులేక పోయినా ప్రైవేటులో కుడా చేర్పించాడు ..కాని ఈ విద్యా సంవత్సరం సరిగా సాగటం లేదన్న ఆందోళన ...వై ఎస్ ఆర్ మృతి , స్వైన్ ఫ్లూ , బందులు , రాస్తారకోలు కారణంగా ఇచ్చిన సెలవలు ఎలా కవర్ చేస్తారో అని ఆలోచిస్తుంటే మళ్లీ బందు ...టీవిలో వస్తున్నా వార్తలు చూస్తూ విద్యాసంస్థలు స్వచ్చందంగా బందు పాటిస్తున్నాయన్న వార్తవిని , స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేసాడు ...వారిని ఎదే విషయం అడగగా స్కూల్ ప్రిన్సిపాల్ అదేమిలేదండి స్కూల్ ఉస్మానియా యునివర్సిటి కి దగ్గరగా వుండటం వల్ల సెలవు ఇచ్చామని ...లేదంటే పిల్ల ప్రాణాలకే ప్రమాదం అని చెప్పటంతో హతాసుదయ్యాడు...విశ్వవిద్యాలయాలు పెద్ద చదువులు చదవటానికా లేక విద్యార్ధులు పెడ దోవ పట్టటానికా అనే ఆలోచనలో మునిగిపోయ్యాడు....
....................................................................
ఇలా రోజువారి కూలీలు , కూరగాయలు అమ్ముకునే వాళ్లు , విద్యార్ధులు , ఉద్యోగులకు శిక్ష వేస్తున్న ఇది అవసరమా...
కారణమేదైనా సరే ఇలా బందుల్జేసేవాళ్ళని బందూకుల్తో గాల్చాలె. ఎవ్వనికేమొచ్చినా జనమ్మీదబడి లొల్లిజేసుడలవాటైంది సాలేగాళ్ళకి.
ReplyDeleteఇక్కడ ఆంధ్ర కాలనీ లు బెట్టుకున్న ఏమన్లేదు.
ReplyDeleteపచ్చల్లమ్ముకోవడానికి వచ్చినొడు పత్రికల అధిపతులైన ఏమన్లేదు.
మీ విశ్వనాథ, శ్రీ శ్రీ లకు వినమ్రంగ మొక్కుతాము…
మా ధాశరథి కాళోజీ లను దాశిపెట్టుడు తప్పు కాదా..?
మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మన్శులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనది తెలుగే కాదన్నోడు, శిగ్గు షరం లేక మనందరం ఒక్కటె కలిసే ఉందాం అంటున్నడు.
బతుకమ్మకు అట్లతద్దె కు బందుత్వం ఎప్పటిది..!
ని అట్టు కు నా జొన్నరొట్టెకు చుట్టరికం ఎక్కడిది..?
నామాటలల్ల అక్కడక్కడ సభ్యతలేదనే ఆక్షేపణవస్తదని నాకెర్కే, కాని నాభాష, నాయాస, నాబతుకు, నా తెలంగాణ ప్రజల పట్లసభ్యతగా ప్రవర్తీంచని వాణితో నాకేం సభ్యత అనేదే నా జవాబు.
- కాళోజి నారాయణరావు
ఖండాలు దాటిన జానపద గీతం నాది.
ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన పోరాటాల వారసత్వం నాది.
చేతుల చెయ్యేసుకొని తల్లికి జై కొడదాం రండి...!
ఈ నేలను అవమానించినోని గుండెల్లో తెలంగాణ డప్పుల దరువెద్దాం రండి..!!!
జై తెలంగాణ..!
జై జై తెలంగాణ !!!
శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజస్వామ్యయుతంగా చేసే ఉద్యమాలకి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది...దానికి విరుద్ధం గా జరిగితే ప్రజలు హర్షించరు......
ReplyDelete