ఇప్పటికే మన నాయకులు అమాయక ప్రజలందరికి సంకేతాలు పంపారు...హింస వద్దు , ఆత్మహత్యలు వద్దు,ఆంధ్రవాళ్లు మన సహొదరులు వారి మీద దౌర్జన్యాలు వద్దు అని..చాలు ఈ సంకేతాలు మేము చూసుకుంటాం అని విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు...దీనివల్ల నష్టం ఎవరికి..పొద్దున ఎవరో టివిలో చెప్తున్నారు మాకు ఈ 50యేళ్ళలో జరిగిన నష్టం ముందు ఇది ఎంత అని..చాలా బాధాకరం..
విద్య , ఉద్యోగ అవకాశాలు, మౌళికవనరుల అభివ్రుద్దికి శాంతి ఎంతో ముఖ్యం ..
1)వేరే రాష్త్రం నుండి వేరే దేశమ్నుండి పెట్టుబడులు రావా లన్న
2)కొత్తగా విద్యాలయాలు స్థాపించాలన్న
3)కొత్త ఆరోగ్యకేంద్రాలు నిర్మించాలన్నా
4)ఉపాధి అవకాశాలు పెంచాలన్నా
5)మన పిల్లలని అతి ప్రమాదకరమైన వ్యాధులనుండి రక్షించి వారికి బంగారు భవిత ఇవ్వాలన్న
6)మనమందరం ఆరొగ్యకరమైన వాతవరణంలో పెరగాలన్నా
హింస విడనాడాలి..మన నిరసనని ఇంకొకరకంగా కూడా వ్యక్తపరచవచ్హు..
అందరికి తెలిసిన విషయమే అమెరికా ఇప్పటికే ట్రావెల్ అడ్వైసరీ అని వారి పౌరులను ఆంధ్రప్రదేశ్ వెల్లటం సురక్షితంకాదు అని చెప్పింది..
యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి నిర్ణయం తీస్కున్నట్టు వినికిడి..
ఇది ఎవరికి నష్టం..
ఒకవేళ మేము ఎవరిమీద ఆధారపడం మా వుద్యోగాలు మేమే స్రుష్టిస్థాం అని అనుకుంటే చెయ్యగల్గిందేమిలేదు...
రాజకీయనాయకులు ఊసరవిల్లుల లంటివారు..యేయెండకా గొడుగు పట్టేరకం..వారి మోసపూరిత వాగ్దానాలు,విద్వేషాలు పెంచే ఉపన్యాసాలు చూసి మోసపొకండి. ...
ఇది మన మాత్రుభూమి మనమే దీనికి పునర్జీవనం తేవాలి...
ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అయినా మనం ఇంకా కుంచిత మనస్తత్వాలతో ఈ నేల నాది ఈ నింగి నాది అనుకోవటం ఎంతవరకు సబబు..
నేను ఒక ఎమెన్సి కంపనీ లో పనిచేస్తాను..మా కంపనీకి చెన్నై ,ముంబై లలో కుడా శాఖలు వున్నాయి,.మొత్తం ఉద్యోగుల సంఖ్య 8000పైచిలుకే ..ఈ గొడవల నేపధ్యంలో మొన్న సీనియర్ మానేజ్మెంట్ మీటింగ్ జరిగింది..చెన్నై కి చెందిన కొందరు సహోద్యొగులు ఇక్కడ(హైదరాబాదు) వాతావరణం బాగలేదని ఫారెన్ క్లైంట్లు ప్రాజెక్టు డెడ్లైన్లు మీట్ అవటంలేదని కనుక ఇక్కడినుండి ఉద్యోగులని చెన్నై తరలించమని రికమండ్ చేసారు..అలాఏమి లేదని నేను నా వాదన చేసాను..పరిస్థితులని గమనిస్తున్నామని మనకి క్లైంటే దేవుడు కాబట్టి వాడికి ఏమన్న ఇబ్బంది కలిగితే ఇక్కడి బేస్ చెన్నైకి మారుస్తామని మా డైరెక్టర్ చెప్పారు...మాలో చాలమంది తెలంగాణా జిల్లాలకి చెందినవారున్నారు....
అందరికి నా విన్నపం అమ్మలారా అయ్యలారా హింసని విడనాడండి..ఈ రొజు మీరు చేసే ఈ విధ్వంసాలు ఒక మాయని మచ్హని ఈ ప్రాంతానికి మిగులుస్తాయి..
అన్నట్టు నేను సమైక్యవాదిని కాను అలాగే తెలంగాణా వాదినికూడా కాదు..
ఒక మానవతా వాదిని..అహింసావాదిని..
well said...dont humiliate others..
ReplyDeletemind blowing...attempt by you...**** this dirty politiciancs are playing vote bank politics..tdp.congi.prp.trs..all these parties cheating poor people ..they r interested to create a new power [state]for their intrests only not for TELANGANA PEOPLE..
ReplyDelete